Sep 24,2023 23:56

మత్యువు ఒడిలో ఓ తల్లి పోరాటం..బతకాలని ఆరాటం..

మత్యువు ఒడిలో ఓ తల్లి పోరాటం..బతకాలని ఆరాటం..
- ఓ వైపు కిడ్నీ వ్యాధి.. మరో వైపు పేదరికం
- ముగ్గురు పిల్లలకు ఒక పూట
అన్నం పెట్టలేని దుస్థితి
- దాతల సాయం కోసం ఎదురుచూపు
ప్రజాశక్తి - గూడూరు రూరల్‌ : గూడూరు లోని, తూర్పు వీధి గిరిజన కాలనీకి చెందిన పామూరు వెంకటమ్మ అనే నిరుపేద యువతి కిడ్నీ కి సంబంధించిన వ్యాధి తో బాధ పడుతోంది. ఆమె వయసు 30 సంవత్సరాలు. ఈ సమయంలో ఆమె భర్త ఆమెకు తోడుగా నీడగా ఉండాల్సింది పోయి ఆమెకు కిడ్నీ వ్యాధి జబ్బు వచ్చిందని ఆమె తనకు ఇంక అవసరం లేదని ఆమెను వదిలిపెట్టి అతను వెళ్లిపోయాడు. ఆమె ఒంటరిగా మిగిలి పోయింది.. ఆమెకు ముగ్గురు చిన్న పిల్లలు వున్నారు. వారి ఆలనా పాలనా చూడాల్సిన స్థితి నుండి అన్నం పెట్టాలని స్థితికి వచ్చి ఒక తల్లిగా ఉండి తాను ఏమీ చేయలేక పోతున్నానని ఆవేదన చెందుతోంది. తన బిడ్డలకి తాను అన్నం పెట్టలేని దుస్థితిలో వుంది. చూడడానికి శక్తి లేదని, ఆహారం పెట్టడానికి ఆమె దగ్గర సరైన సరుకులు లేవు. ఆమె ఒంటరి పోరాటం చేస్తూ జీవనం సాగిస్తోంది. శివాలయం ఆటో స్టాండు వారు రెడ్‌ సంస్థ వారికి తెలపడంతో సనిశెట్టి వేంకట శ్రీధర్‌ జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కష్ణ చైతన్య దాతత్వంతో ఆదివారం ఒక నెలకి సరిపడ సరుకులు అందించారు. రెడ్‌ సంస్థ సభ్యులు జానా సుధీర్‌, శ్రీనివాస్‌ ఆచారి, జమీర్‌, ఆటో స్టాండ్‌ సభ్యులు శ్రీను, సలీం, పాల్గొన్నారు. మన గూడూరులో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్లకు ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నారు.