కె కృష్ణమాచారి దర్శకత్వంలో గెట్ అప్ శ్రీను హీరోగా నటిస్తున్న 'రాజు యాదవ్' చిత్రం నుండి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. 'నన్నే చూసావే.. నువ్వు నన్నే నన్నే చూసినవే' అనే లిరికల్ సాంగ్ మేకర్స్ విడుదల చేశారు. రాం మిరియాల పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత చంద్రబోస్ రచన చేయగా, రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.