
అట్లను తిన్నాడు
బిస్కట్లను తిన్నాడు
చిట్టి తమ్ముడు మెట్లు ఎక్కి
జాకట్లారేసాడు
పక్కగంతలో కాల్వకు
గట్టి గట్లు వేసినాడు
నాటిన మొక్కలు పీకిన
పిల్లను తిట్లు తిట్టినాడు
పట్ల కర్రతో గదిలో
మూలల పట్లు దులిపినాడు
ధూళిపడిందని పైకి తీసి
దుప్పట్లు దులిపినాడు
వదులైపోయిన కుర్చీ మూలల
నట్లు బిగించాడు
కట్ల పాముని పొట్ల కాయతో
బెదర గొట్టినాడు
కొమ్మకు చేరిన పిట్టకు
సెల్‌తో ఫొటోలు తీసాడు
తుర్రున ఎగిరిన పిట్టను
చూసి ఆనందించాడు !
- ఎన్.వి.ఆర్ సత్యనారాయణ మూర్తి