ప్రజాశక్తి-విఆర్ పురం : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రతీ వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయమిది.లేకుంటే మనందరి భవిష్యత్తూ.చీకటిమయమైపోతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రేఖపల్లి కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పూనం.సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ మోడీ - అమితా ల నాయకత్వంలో బిజెపి-ఆర్ ఎస్ ఎస్ కూటమి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండవలసిన ప్రజలమధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తున్నది. మరోవైపు అదానీ, అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశం సంపదను దోచిపెడుతున్నది. ప్రశ్నించే ప్రతీ ఒక్కరినీ నిరంకుశంగా అణచివేస్తున్నారు. నాడు అనేక మంది త్యాగధనులు బ్రిటిష్ వలస పాలనను ఎదిరించి తరిమికొట్టి మనకి స్వాతంత్య్రం తెచ్చారు. నేడు అదే స్వాతంత్య్రం పెను ప్రమాదంలో పడింది. దానిని కాపాడుకోడానికి. మనం ఆనాటి జాతీయోద్యమ స్ఫూర్తితో మళ్ళీ ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. మనందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకుల్ని, మనం కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ఓడరేవుల్ని, ఆఖరికి మన అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోంది మోడీ ప్రభుత్వం. మోడీ అండదండలతో అదానీ ఏ విధంగా ప్రపంచాన్ని మోసం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టాడో హిండెన్బర్గ్ నివేదిక బట్టబయలు చేసింది.అయినా, దానిమీద విచారణకు అంగీకరించకుండా అదానీని ఈ కేంద్ర ప్రభుత్వం వెనకేసుకువస్తోంది. పైగా మరింత వేగంగా దేశంలోని అడవులను, భూములను, విద్యుత్తు ప్రాజెక్టులను, గనులను కార్పొరేట్లకు అక్రమంగా కట్టబెట్టడుతోంది. పేదలకు, సామాన్య ప్రజలకు అండగా ఉండడం పోయి వారిమీదే మోయలేనంత భారాలను మోపుతున్నది మోడీ ప్రభుత్వం, గ్యాస్ బండ మనకు గుదిబండ అయిపోయింది. కరెంటు బిల్లులు ముట్టుకుంటేనే షాకులు కొడుతున్నాయి. దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తల నాయకులు పంకు సత్తిబాబు పోడియం. శ్రీరామ్ మూర్తి కారం. సుందరయ్య. ఎంపీపీ కారం. లక్ష్మి. స్థానిక సర్పంచ్ పూనం సరోజిని. తదితరులు పాల్గొన్నారు.










