Jan 24,2023 23:03

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాల విద్యార్థులు డేటా మార్షల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్య్వూలలో 43 మంది విద్యార్థులు ఉద్యోగార్హత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఫాదర్‌ కిషోర్‌ తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం కళాశాలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల అభినందన సభ జరిగింది. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ కిషోర్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో బిఎ, బికాం, బియస్సీ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ హెల్త్‌ కేర్‌ రెవిన్యూ అనలిటిక్స్‌ కంపెనీ అయిన డేటా మార్షల్‌ క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈంసదర్భంగా ఎంపికైన తమ విద్యార్థులకు సంవత్సరానికి జీతం రూ.2.8 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు ఇవ్వనున్నారని తెలిపారు. విద్యార్థులను కళాశాల క్యాంపస్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.సహాయ భాస్కరన్‌ అభినందించారు.