లయన్స్ సేవలు మరింత విస్తృతం చేయాలి
- లయన్స్ గవర్నర్ రామచంద్ర ప్రకాష్
ప్రజాశక్తి - నంద్యాల
లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేయాలని, ముఖ్యంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని లయన్స్ గవర్నర్ రామచంద్ర ప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక బాలాజీ కళ్యాణమండపంలో సోమవారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం గౌరవ అతిధులు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడారు. నంద్యాలలో లయన్స్ క్లబ్ గత 50 సంవత్సరాలు పైగా చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా సేవా కార్యక్రమాల్ని నిర్వహించాలని కోరారు. లయన్స్ క్లబ్ నంద్యాల కార్యదర్శి లయన్ కూరా ప్రసాద్ తండ్రి శ్రీనివాస్ స్వర్గధామం అభివృద్ధికి రూ.30 వేలు విరాళంగా గవర్నర్ చేతుల మీదుగా అందించారు. కార్యదర్శి కూర ప్రసాద్, కోశాధికారి రత్న కుమార్ గత సంవత్సర కాలంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు నివేదిక సమర్పించారు. సభ ప్రారంభంలో లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రాంతీయ చైర్మన్ కసెట్టి చంద్రశేఖర్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ సహదేవుడు శ్రీకాంత్ రవి ప్రకాష్ భవనాసి నాగ మహేష్, లయన్స్ సభ్యులు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు.










