ప్రజాశక్తి-తాళ్లరేవు ఉత్తమ సేవలందించి తాళ్లరేవు లయన్స్ క్లబ్‌తో బాటు అన్ని క్లబ్‌లూ జిల్లాకు ఆదర్శంగా నిలవాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ అన్నారు. లయన్స్ క్లబ్ హాల్లో పూర్వపు తాళ్లరేవు క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బుధవారం తాళ్లరేవు, గొల్లపాలెం, కోనసీమ, తూరంగి క్లబ్బుల నూతన కమిటీ ప్రమాణస్వీకారం చేశారు. జివిఎస్.రాజు నూతన కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. తాళ్లరేవు లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా చోడే శ్రీనివాసరావు, కార్యదర్శిగా పెన్మత్స రాయపరాజు, కోశాధికారిగా కట్ట ఆదినారాయణ, ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్‌గా నడింపల్లి వినోద్ వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ మాట్లాడారు. గొల్లపాలెం, తూరంగి, కోనసీమ అధ్యక్షులు సూర్యనారాయణ రాజు, మధు, శివరామకృష్ణ కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అనంతరం తాళ్ళరేవు నూతన అధ్యక్షులు చోడే శ్రీనివాస్ మాట్లాడారు. తాళ్లరేవు లయన్స్ క్లబ్ సేవలు విస్తరించి సమాజానికి ఉపయోగపడే విధంగా మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సి శ్రీరామరాజు, జెడ్‌సి.సుమన్ వర్మ, నున్న దత్తు, కాలే వీర్రాజు. చోడే మాలతి వసుంధర, పంతం సూరిబాబు, తాళ్లరేవు వాసవి క్లబ్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, అత్తిలి బాబురావు, వల్లు రాజబాబు పాల్గొన్నారు.










