Feb 26,2023 20:19

19 మంది దివ్యాంగులకు కుట్టుమిషన్లు, 10 చక్రాల కుర్చీలు పంపిణీ చేస్తున్న లయన్స్‌ గవర్నర్‌ రామచంద్ర ప్రకాష్‌

లయన్స్‌ క్లబ్‌ సేవలు ప్రశంసనీయం
- లయన్స్‌ గవర్నర్‌ రామచంద్ర ప్రకాష్‌
ప్రజాశక్తి - నంద్యాల

       నంద్యాల లయన్స్‌ క్లబ్‌ సేవలు ప్రశంసనీయమని లయన్స్‌ జిల్లా గవర్నర్‌ రామచంద్ర ప్రకాష్‌ పేర్కొన్నారు. లయన్స్‌ జిల్లా గవర్నర్‌ రామచంద్ర ప్రకాష్‌ నంద్యాల పర్యటన సందర్భంగా ఆదివారం నంద్యాల లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చంద్రమోహన్‌, కార్యదర్శి కూర ప్రసాద్‌, కోశాధికారి రత్న కుమార్‌ నిర్వహణలో, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రవి కృష్ణ, ప్రాంతీయ చైర్మన్‌ కశేట్టి చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో పట్టణంలో రూ. 4 లక్షల వ్యయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక స్నేహ వృద్ధాశ్రమానికి 150 కేజీల కంది బేడలు, స్వామి రెడ్డి, ఉపేంద్ర రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం, నంద్యాల శివార్లలో పోసిన సిల్క్స్‌ అధినేత పోసిన సుబ్బారావు ఏర్పాటు చేసిన లయన్స్‌ క్లబ్‌ స్వాగత బోర్డ్‌ను లయన్స్‌ గవర్నర్‌ ఆవిష్కరించారు. అనంతరం క్రాంతి నగర్‌లో జీవనజ్యోతి అంధుల వసతి గృహంలో వరద మురళి సౌజన్యంతో ఆహార సరుకులు అందజేశారు. స్థానిక సంఘమిత్రలో ఉన్న బాలలకు డాక్టర్‌ జగన్మోహన్‌ రెడ్డి సౌజన్యంతో నిత్యవసర కిట్లు పంపిణీ చేశారు. మహానంది రోడ్డులో ఉన్న బాలికల ఛాత్రాలయం బాలికలకు కాస్మెటిక్స్‌ కిట్లు కసెట్టి చంద్రశేఖర్‌, వేణుమాధవ్‌, శ్రీకాంత్‌ల సహకారంతో అందజేశారు. తదుపరి నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వికలాంగుల హెల్త్‌ కార్డులు ఐఎంఏ కార్యదర్శి డాక్టర్‌ చంద్రశేఖర్‌, కోశాధికారి డాక్టర్‌ అనిల్‌ సహకారంతో దేవి ఎలక్ట్రికల్స్‌ అధినేత శేగు కిషోర్‌ సౌజన్యంతో 15 మందికి నెలవారి మందులు, లయన్స్‌ సభ్యులు రవి ప్రకాష్‌, యూసుఫ్‌, గోళ్ల సుదర్శనం, డాక్టర్‌ రాజీవ్‌ సహకారంతో చంక కర్రలు పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున గవర్నర్‌ రామచంద్ర ప్రకాష్‌ ను ఘనంగా సత్కరించారు. అలాగే బాలాజీ కళ్యాణ మండపంలో లయన్స్‌ మాజీ జోన్‌ చైర్మన్‌, వికలాంగుల సంక్షేమ సంఘం కోఆర్డినేటర్‌ రమణయ్య నిర్వహణలో విరాళాలతో 19 కుట్టుమిషన్లు, 13 వినికిడి మిషన్లు, 9 చక్రాల కుర్చీలు వికలాంగులకు అందజేశారు. అలాగే బాలాజీ కల్యాణ మండపంలో జిల్లా జీత్‌ కునే డో కరాటే సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కరాటే పోటీలను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో లయన్స్‌ జిల్లా క్యాబినెట్‌ సెక్రటరీ పసుపుల వెంకటరమణ, సేవా కార్యక్రమాల క్యాబినెట్‌ సెక్రటరీ సత్యనారాయణ, లయన్స్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.