
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కడకట్లలోని జనతా ఛారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో పూర్వ అధ్యక్షులు సన్నిధి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన నిడదవోలు రాజేశ్వరి నేత్ర వైద్యశాల వైద్యులతో ఆదివారం కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా డిప్యూటీ గవర్నర్ పదం కుమార్ గుప్త ఆర్థిక సహకారంతో 103 మందికి కంటి పరీక్షలు చేశారు. ఉచిత కంటి ఆపరేషన్ల నిమిత్తం 13 మందిని నిడదవోలుకు పంపించారు. 22 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా చైర్‌పర్సన్ పచ్చా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడుతూ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనను సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిన్నం జగదీష్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.