Oct 02,2023 16:45

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు డి ఆర్ ఎల్ హోటల్ కు ఎదురుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా రాజంపేట పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు నిరాహార దీక్ష లో పాల్గొని నల్ల రిబ్బన్లు ధరించి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షా శిబిరంలో పార్టీ ఇంఛార్జి మరియు సీనియర్ న్యాయవాది అయిన చెంగాల్ రాయుడు, కృష్ణ కుమార్, వెంకట సుబ్బయ్య, నాగ సుధాకర్ రెడ్డి, బాసినెని రమేష్, ప్రభాకర్ నాయుడు, చంద్ర శేఖర్, పెంచలయ్య, అక్షయ కుమార్, ప్రేమ కుమార్, సూర్య చైతన్య తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణమాట్లాడుతూ చంద్ర బాబు నాయుడుకు 17 (ఏ ) వర్తించి ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పాడలేదని., రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని అన్నారు. రేపటి రోజు సుప్రీం కోర్ట్ లో న్యాయం జరుగుతుందని న్యాయవాదులు కృష్ణ కుమార్, ప్రభాకర్ నాయుడు అన్నారు.