Oct 25,2023 15:11

ప్రజాశక్తి-మడకశిర రూరల్ : శ్రీ సత్యసాయి మడకశిర మండలం హరే సముద్రం గ్రామానికి చెందిన గతంలోకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన న్యాయవాది అశ్వత్ నారాయణ తిరుపతిలోనే వైసిపి కార్యాలయంవద్ద పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాకు చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావి శేఖర్ రెడ్డి నాయకులు వాగేష్ పాల్గొన్నారు.