ప్రజాశక్తి - టి.నరసాపురం
స్థానిక జెడ్‌పి హైస్కూల్ వద్ద మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యూరే విగ్రహాన్ని ఫొటో, వీడియో గ్రాఫర్స్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు గురువారం ఆవిష్కరించారు. విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన బస్‌షెల్టర్‌ను వైసిపి మండల నాయకులు దేవరపల్లి సీతారాంప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ అందాలను కెమెరాలో బంధించి ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రపంచానికి అందిస్తున్నారన్నారు. ప్రకృతి అందాలతో పాటు మనిషి రూపాలను చిరస్థాయిగా నిలిపేలా కెమెరాను సృష్టించడం గొప్ప విషయమన్నారు. లూయిస్ డాగ్యూరేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫొటో, వీడియో గ్రాఫర్స్ రాష్ట్ర సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు అమీర్ బాషా, మండల అధ్యక్షులు పల్లగాని ప్రసాద్, పి.భార్గవ్, మహా డిజిటాల్ మహారాజు, కె.సత్యనారాయణ, దాసరి బాబి పాల్గొన్నారు.










