ప్రజాశక్తి - ముసునూరు
గ్రామ ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా గ్రామాల్లో కూడా వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండలంలోని లోపూడి గ్రామంలో రూ.20.80 లక్షల నిధులతో నిర్మించిన వెల్‌నెస్ సెంటర్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు డాక్టర్ ప్రతాప్, ఎంపిపి రాపర్ల కృష్ణకుమారి, వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయన, సర్పంచి పేరం కృష్ణ, వైసిపి మండల అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు బి.నరసింహరావు, వైద్యులు ఎం.కిరణ్‌కుమార్, కరిముల్లా, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.










