Jun 07,2023 19:43

లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి - ఆదోని
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు కడపలో కలిశారు. కడపలో కలిసి ఆదోని రాజకీయ పరిస్థితులను చర్చించామని మీనాక్షి నాయుడు తెలిపారు. బుధవారం కడపలో జరిగిన మిషన్‌ రాయలసీమ కార్యక్రమంలో అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పార్టీ ఇన్‌ఛార్జీలతో లోకేష్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విస్మరించారన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, కొత్తగా ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించిన దాఖలు లేవన్నారు. తమ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైసిపి నాయకుల గుండెల్లో గుబులు పుట్టిందని తెలిపారు. ప్రజలకు వివరించి చైతన్య పరుస్తామన్నారు. నాయకులు బుద్ధారెడ్డి, తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, సుబ్బు, శేషారెడ్డి, దిబ్బనకల్‌ లక్ష్మణ ఉన్నారు.
10 నుంచి 'భవిష్యత్‌కు గ్యారంటీ'
ఈనెల 10 నుంచి టిడిపి ఆధ్వర్యంలో 'భవిష్యత్‌కు గ్యారంటీ' కార్యక్రమం చేపడుతున్నట్లు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు తెలిపారు. బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టో కరప్రతాలను గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. టిడిపి తరఫున ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్లు, మాజీ వైస్‌ ఛైర్మన్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ జడ్‌పిటిసిలు, క్లస్టర్‌, యూనిట్‌ మెంబర్లు, టిడిపి పార్లమెంట్‌ సభ్యులు, టిడిపి తరఫున వివిధ హోదాల్లో, పదవులు ఉన్న వ్యక్తులు, పట్టణ గ్రామ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొనాలని కోరారు. టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.
వివాహ వేడుకలో నాయకుల సందడి
పట్టణంలోని కోట వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వాల్మీకి కాశీ విశ్వనాథ్‌, దేవిక వివాహ వేడుకల్లో నాయకులు సందడి చేశారు. వధూవరులను మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు, రంగస్వామి నాయుడు, గుంటప్ప, కౌతాళం ఉల్లిగయ్య, గుడిసె కృష్ణమ్మ, భూపాల్‌ చౌదరి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 1వ వార్డు కౌన్సిలర్‌ పార్వతి, వాల్మీకి వెంకటేష్‌, రాజు, లక్ష్మన్న, కాశీ, గోపాల్‌, ముజీబ్‌ అహ్మద్‌ అతిథులకు స్వాగతం పలికారు.