May 16,2023 00:01

నర్సీపట్నంలో హాజరైన అయ్యన్న, నాయకులు

ప్రజాశక్తి- నర్సీపట్నం టౌన్‌:లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకి సంఘీభావంగా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పోలీస్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పాదయాత్రను చేపట్టారు. స్థానిక పెద్ద చెరువు వద్ద మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. బైక్‌ ర్యాలీ చేపట్టారు.అబీద్‌ సెంటర్లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, రాజ్యాంగానికి జగన్‌ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు.వైసీపీ రాక్షస పాలనలో రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత బుద్ధ నాగ జగదీశ్వరరావు, జడ్పిటిసి సుకల రవణమ్మ, మున్సిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాడుగుల: టిడిపి నేత నారా లోకేష్‌ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర వంద రోజులకు చేరుకోవడంతో మాడుగులలో సోమవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఘాట్‌ రోడ్‌ జంక్షన్‌ వద్ద నుండి మాడుగుల వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ, లోకేష్‌ పాదయాత్ర విజయవంతంగా నడుస్తుందని, ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోటవురట్ల: యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం టిడిపి మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాదయాత్ర చేపట్టారు. రామచంద్రపాలెం గ్రామం నుండి బికే పల్లి, జల్లూరు మీదుగా ఎండపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు.పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జానకి శ్రీను, జిల్లా కార్యదర్శి లాలం కాశీనాయుడు, వెచలపు జనార్ధన్‌, పీకే పల్లి సర్పంచ్‌ లింగన్న నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరావు, పలువురు ఎంపీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు.
అనకాపల్లి : రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారని, యువగళం పాదయాత్రతో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని నెహ్రుచౌక్‌ జంక్షన్‌ నుంచి సుంకరమెట్ట వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ముందుగా మున్సిపల్‌ స్టేడియంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో నేతలు ఎం నీలబాబు, మల్ల సురేంద్ర, బిఎస్‌ఎస్‌కె. జోగినాయుడు, కాయల మురళి, కొణతాల శ్రీనివాసరావు, పోలవరపు త్రినాథ్‌, సబ్బవరపు గణేష్‌, బొద్దపు ప్రసాద్‌, ఉగ్గిన రమణమూర్తి, రత్నకుమారి, ఎంఎస్‌ఎన్‌ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండల కేంద్రంలో సోమవారం టిడిపి ఎలమంచిని నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ప్రారంభించారు. అచ్యుతాపురం నుంచి చౌడపల్లి ,కొండకర్ల, హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక వరకు పాదయాత్ర సాగింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌ కుమార్‌, అచ్యుతాపురం మండల టిడిపి అధ్యక్షులు జనపరెడ్డి నరసింహారావు పాల్గొన్నారు.
భీమునిపట్నం : లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర సోమవారం నాటికి 100 రోజులు పూర్తచేసుకున్న సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యాన తగరపువలస నుంచి భీమిలి పార్టీ కార్యాలయం వరకు 5 కిలోమీటర్ల మేర సోమవారం సాయంత్రం పాద యాత్ర చేపట్టారు. ముందుగా తగరపువలస జంక్షన్‌ వద్ద డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పార్టీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.శ్రీభరత్‌తో కలిసి కోరాడ రాజబాబు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన రహదారి మీదుగా వై జంక్షన్‌కు చేరుకుని అక్కడ ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి పాదయాత్ర భీమిలి బ్యాంక్‌ కాలనీ, చిన బజారు మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో గంటా నూకరాజు, డిఎఎన్‌.రాజు, పతివాడ రాంబాబు, టి.సూరిబాబు, బడిగింటి నీలకంఠం, కోరాడ రమణ, పిట్టా సురేష్‌, వానపల్లి సత్య, తెలుగు మహిళలు, తెలుగు యువత పాల్గొన్నారు.
ఆరిలోవ : విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన యువగళానికి సంఘీభావ యాత్రను సోమవారం నిర్వహించారు. 10వ వార్డు రవీంద్రనగర్‌, వివేకానందనగర్‌ వినాయక ఆలయం నుంచి ప్రారంభించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సంఘీభావ యాత్రను ప్రారంభించారు. ముందుగా ఆయన రవీంద్రనగర్‌ కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రవీంద్రనగర్‌ నుంచి తోటగరువు, బాలాజీనగర్‌, ఆరిలోవ, టిఐసి పాయింట్‌ మీదుగా ఆరిలోవ కాలనీ చివరి బస్టాపు వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడారు. టిడిపి నాయకులు పట్టాభి, వార్డు కార్పొరేటర్‌ మద్దిల రామలకీëరాజశేఖర్‌, పోతన్న రెడ్డి, ఒమ్మి సన్యాసిరావు, బుడుమూరు గోవిందు, ఒమ్మి అప్పలరాజు, గాడు అప్పలనాయడు, ఒమ్మి పోలారావు, గాడి సత్యం, యేడువాక సన్యాసిరావు, తురకపూడి బాలస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.