Jun 13,2023 20:19

లోకేష్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
యువగళం పాదయాత్ర ప్రజల్లో చైతన్యాన్ని రగల్చడమే కాకుండా స్తబ్ధతలో ఉన్న సర్కారులో సైతం చలనం కలిగించిందని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు పార్లమెంట్‌ సభ్యులు బోయ తేజ, ఆదోని నియోజకవర్గ అధ్యక్షులు బెస్త జయ సూర్య తెలిపారు. మంగళవారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నారా లోకేష్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లోకేష్‌ యువగళంతో ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరై కార్యరూపం దాల్చిందన్నారు. ప్రధాన కార్యదర్శి బల్లేకల్లు సూర్య, ఉపాధ్యక్షులు రమేష్‌, కోడి మహేష్‌ మాట్లాడుతూ... ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి వైసిపికి ఓటు వేసి గెలిపిస్తే ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల పాటు కాలయాపన చేశారని విమర్శించారు. కార్యదర్శి నూర్‌, మెహబూబ్‌, వెంకీ మాట్లాడారు. యువనేత నారా లోకేష్‌ ఏప్రిల్‌ 21న ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై వైసిపి సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతోపాటు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో సర్కారు తీరులో మార్పు వచ్చిందన్నారు. ఆదోని నియోజకవర్గ సభ్యులు అజరు, హేమంత్‌, ధర్మ, గౌతం, మంజు, అభి, రాజేష్‌, వీరేంద్ర, సిద్ధు, రాజు, మనోహర్‌ పాల్గొన్నారు.