Aug 31,2023 21:38

ప్రజాశక్తి - వీరవాసరం
నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా టిడిపి మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్ర నందమూరుగరువు అంజనేయస్వామి గుడి నుంచి వీరవాసరం తూర్పుచెరువు సెంటర్‌ వరకూ సాగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెంటే పార్థసారధి, వీరవల్లి చంద్రశేఖర్‌, మళ్ల శ్రీరామ్మూర్తి, రాయపల్లి వెంకట్‌, కడలి నెహ్రూ, కడలి వాసు, అడిదెల చిరంజీవి పాల్గొన్నారు.
మొగల్తూరు:మండలంలో చేపట్టిన యువగళానికి మద్దతుగా చేపట్టిన పాదయాత్ర వెలవెలబోయింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో పాదయాత్రకు మద్దతుగా మండలంలోని కొత్తోట గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి ముత్యాలపల్లిలో ఉన్న బండి ముత్యాలమ్మ ఆలయం వరకూ పాదయాత్ర చేపట్టారు. అభిమానులు, కార్యకర్తలు తక్కువ సంఖ్యల హాజరవ్వడంతో ఈ యాత్ర వెలవెలబోయింది.