ప్రజాశక్తి-ఆలూరు
నారా లోకేష్ సవాల్‌కు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. గురువారం ఆలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు చేసిన ఇట్టినా కంపెనీ భూములను హామీ ఇచ్చిన విధంగా 100 ఎకరాలను మార్కెట్ ధరకే తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. రైతులపై ప్రేమ ఉన్న నారా లోకేష్ మిగిలిన భూములను కొనుగోలు చేసి రైతులకు ఇస్తే బీసీ రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు ఆలూరును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపామని తెలిపారు. ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆరోపిస్తున్న టిడిపి నేతలు అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జయరాం










