May 25,2023 20:32

cartoon

లోకేష్‌ సాక్షిగా
టిడిపిలో భగ్గుమన్న విబేధాలు
- డోన్‌లో ధర్మవరం వర్సెస్‌ కెఇ..
- నంద్యాలలో ఎవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ గ్రూపు దాడి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

    నారా లోకేష్‌ చేపట్టిన యువగళం యాత్ర సందర్భంగా నంద్యాల జిల్లాలోని టిడిపిలో విబేధాలు భగ్గుమన్నాయి. డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డిపై కెఇ వర్గం కరపత్రాలు ముద్రించారు. నంద్యాలలో ఎవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గం దాడికి పాల్పడింది. దీంతో లోకేష్‌ రాక సఖ్యతను నింపలేకపోయిందనే చర్చ సాగుతోంది...
     టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర గత నెల 13న డోన్‌ నియోజకవర్గంలో మొదలై తాజాగా ఆళ్లగడ్డ నియోజకవర్గంతో ముగిసింది. ఆయన రాక సందర్భంగా డోన్‌, నంద్యాలలో టిడిపిలో విబేధాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. యువగళం పాదయాత్ర జిల్లాలో మొదటగా డోన్‌ నియోజకవర్గం లోకి ప్రవేశించింది. రెండు రోజుల పాటు ఆ నియోజక వర్గంలోని ప్యాపిలి మండలంలో సాగింది. మొదటి రోజు అంతా ప్రశాంతంగానే కనిపించినా రెండో రోజు పార్టీలో ఒక గ్రూపు ముద్రించిన కరపత్రాలు బయట కు వచ్చాయి. తెలుగుదేశం డోన్‌ నియోజకవర్గం వీరాభిమానులు నారా లోకేష్‌ కు విన్నవిస్తున్నట్లు ఆ కరపత్రాలను ముద్రించారు. నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, టిడిపిలో ఉన్న వైసిపి కోవర్టులా పనిచేస్తున్నాడని అందులో పేర్కొన్నారు. ''టిడిపి పార్టీ ఆవిర్భవించి నప్పటి నుండి ఉన్న నాయకులను, కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న ఇంచార్జి ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గనతో సత్సంభాలు కలిగి తన వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా టిడిపిని తాకట్టు పెట్టి ఇంచార్జ్‌ పబ్బం గడుపుతున్నారు.'' అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. దయుంచి డోన్‌ ఇంచార్జి నియామకం గురించి పునరాలోచి ంచండి.. పార్టీని బ్రతికిం చండి.. అంటూ విన్నవించా రు. ఈ కరపత్రం సామాజిక మాధ్యమల్లోనూ చక్కర్లు కొట్టడంతో నియోజవర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది. నంద్యాల నియోజకవర్గంలోనూ టిడిపిలో విబేధాలు బయటపడ్డాయి. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ ఏవి సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ వర్గం దాడులకు దిగింది. లోకేష్‌ పాదయాత్ర నంద్యాల జిల్లా కొత్తపల్లె విడిది కేంద్రానికి చేరుకున్న సమయంలో లోకేష్‌ వెంట అఖిల ప్రియ, విఖ్యాత్‌ రెడ్డి, ఎవి సుబ్బారెడ్డి భారీ జనసమూహంతో వెళ్తుండగా లోకేష్‌ విడిది ప్రాంతం చేరుకోగానే లోకేష్‌ తో పాటు వెళ్తున్న అఖిల ప్రియను తోసుకొని ఎవి సుబ్బారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో ఆమెకు ఎవి సుబ్బారెడ్డి చేయి తగిలింది. దీంతో అఖిల ప్రియా అనుచరులు ఎవి సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో సుబ్బారెడ్డి కింద పడిపోయారు. వెంటనే పోలీసులు అందరిని చెదరగొట్టి ఎవి సుబ్బారెడ్డిని కారులో పంపించి వేశారు. ఏవి సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎవి సుబ్బారెడ్డి ఫిర్యాదుతో అఖిలప్రియ, ఆయన భర్త భార్గవ్‌రామ్‌ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అఖిలప్రియ దంపతులు జైలుకు వెళ్లి బుధవారమే బెయిల్‌పై బయటకు వచ్చారు. గత కొద్ది కాలంగా ఇరువర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఇలా టిడిపిలో విబేధాలు బయటపడటంతో లోకేష్‌ పాదయాత్ర నాయకుల్లో ఉన్న విబేధాలను మరింత పెంచిందనే చర్చ జిల్లాలో నడుస్తోంది.