Aug 09,2023 00:17

పిడుగురాళ్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పై విమర్శలు చేసే స్థాయి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లేదని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జానపాడులో నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జివి ఆంజనేయులు మాట్లాడుతూ లోకేష్‌ ఎక్కడ పాదయాత్ర చేస్తే అక్కడి వైసిపి ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో పోటీ చేయాలని అనడం చూస్తుంటే ఇదంతా తాడేపల్లి స్క్రిప్ట్‌లా ఉందని విమ ర్శించారు. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై విమర్శలు గుప్పించారు. ఆగ డాలు మరింతగా పెరిగిపోయాయని ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు.మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గతంలో మాచర్లలో విగ్రహాల దొంగతనం చేసి పోలీ సులకు పట్టుబడిన రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట రామిరెడ్డిలు లోకేష్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో వారు చేస్తున్న అవినీతికి అక్రమాలకు త్వరలో తెరపడనుందని అన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యర పతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ లోకేష్‌, చంద్రబాబుపై వైసిపి నాయకులు చౌకబారు మాటలు మాట్లాడటం తగదని అన్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ లోకేష్‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ అర వింద్‌ బాబు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు జి.నాగేశ్వరరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.