Apr 19,2023 19:51

సమావేశంలో మాట్లాడుతున్న సోమిశెట్టి, తిక్కా రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రతో వైసిపి ప్రభుత్వ పతనం ఖాయమని టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిడిపి మంత్రాలయం ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక రేణుక ఎల్లమాంబ ఆలయ ప్రాంగణంలో సభా స్థలాన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి, మండల అధ్యక్షులు జ్ఞానేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 24న లోకేష్‌ యువగళం పాదయాత్ర కోసిగి మండలానికి చేరుకుంటుందని తెలిపారు. భారీ సభతో పాటు రాత్రి బస ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. టిడిపితోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. వైసిపి ప్రభుత్వంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఇంతవరకు రాజధాని లేని ఏకైక రాష్ట్రం ంధ్రప్రదేశ్‌ అని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో టిడిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కోరారు. నాడిగేని అయ్యన్న, భరద్వాజ్‌ శెట్టి, మహాదేవ, కొండగేని వీరారెడ్డి, వందగల్లు నరసింహులు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.