Aug 20,2023 21:52

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
           త్వరలో జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని ఏలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) కోరారు. స్థానిక అమీనాపేటలోని పార్టీ కార్యాలయంలో టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం తెలుగుయువత జిల్లా అధ్యక్షులు రెడ్డి సూర్యచంద్రరావు(చందు) అధ్యక్షతన తెలుగు యువత సమావేశం జరిగింది. తొలుత టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గం తరపున జిల్లాలో యువగళం పాదయాత్ర విజయవంతానికి అన్నివిధాలా సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎంఎల్‌ఎలు చింతమనేని ప్రభాకర్‌, గంటా మురళీ, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, డివిజన్‌ ఇన్‌ఛార్జులు, పలు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
         నూజివీడు రూరల్‌ : వచ్చేవారం నూజివీడులో జరిగే లోకేష్‌ యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎంఎల్‌ఎ, నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం నూజివీడులోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకుని పాదయాత్రలో ప్రజలను భాగ స్వామ్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పరిశీల కులు వేణు గోపాల్‌, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
             ముసునూరు : టిడిపి రాష్ట్ర నాయకులు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని నూజివీడు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని కాట్రేనిపాడులో టిడిపి నాయకుల, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈనెల 24, 25 తేదీల్లో నూజివీడు నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర సాగుతుందని, యాత్రఖర్చు నిమిత్తం కాట్రేనిపాడు ఉపసర్పంచి తనయుడు, టిడిపినేత రాపర్ల మురళీ మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో రూ.ఐదు లక్షల చెక్కును ముద్దరబోయినకు అందజేశారు. సర్పంచి గద్దల సుహాసిని మోహన్‌రావు, ఎంపిటిసి సూర్యదేవర నాగమంజుల శ్రీనివాసరావు, టిడిపి నాయకులు రాపర్ల ప్రతాప్‌, రాపర్ల బాలకృష్ణ, సొంగా ఇస్సాక్‌ పాల్గొన్నారు.