Apr 27,2023 01:55
లోకేష్‌తో పాదయాత్రలో పాల్గొన్న సజ్జా వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-చీరాల: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతున్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు యువగళం పాదయాత్రలో చీరాల టిడిపి నాయకులు సజ్జ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా లోకేష్‌ను అనుసరిస్తూ పాదయాత్రలో నడిచారు. వివిధ రాజకీయ అంశాలను, ప్రజల సమస్యలను, చేనేతల సమస్యలను యువనేత లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ అధినేతకు దగ్గరగా ఉండటం, లోకేష్‌ పాదయాత్రలో సజ్జ వెంకటేశ్వర్లు పాల్గొనడం చీరాల నియోజకవర్గంలోని టిడిపి నేతల్లో చర్చనీయాంశమైంది.