Apr 10,2023 01:39
లోకేష్‌ కలిసి నడుస్తున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: టిడిపి యువనేత నారా లోకేష్‌ పాదయాత్రలో బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశిరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదివారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో లోకేష్‌తో పాటు ఏలూరి పాల్గొనడం కార్యకర్తల్లో జోష్‌ నింపింది. ఈ పాదయాత్రలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడం పట్ల నేతలు యువనేత లోకేష్‌ను అభినందించారు.