ప్రజాశక్తి-యంత్రాంగం
కోటవురట్ల:తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని మండల కేంద్రంలో టిడిపి నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జానకి శ్రీను మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్రతో
అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడు తున్నాయన్నారు.తెలుగు యువత మండల అధ్యక్షులు తిరుమలరావు మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజుపేట సర్పంచ్ బొడ్డేటి వెంకటరమణ, కోటవురట్ల ఎంపిటిసి పి సూర్యారావు, కసిరెడ్డి ఏసుబాబు, బత్తుల అప్పారావు, సుంకర బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్:వేమూలపూడిలోని వేమాలమ్మ ఆలయంలో టీడీపీ మండల అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి, ఎంపిటిసి బొళ్ళెం రామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలం శ్రీరంగ స్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన విధానాలకు వ్యతిరేకంగా, ప్రజల్ని చేతన్యం పరచడానికి లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారన్నారు.
మాకవరపాలెం:రాచపల్లి కామేశ్వరమ్మ గుడి వద్ద టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఆర్‌వై పాత్రుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. వైసిపి పాలనకు చమరగీతం పాడాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లు రామునాయుడు, రుత్తల నందకిషోరు, రుత్తల శేషుకుమార్, జోగిపాత్రుడు, వి.గోవింద, కోసూరు శ్రీను, దుంగల రమణ, చిరంజీవి, అడిగర్ల చిన్నబాబు పాల్గొన్నారు
ఎస్.రాయవరం:పంచాయుతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు యేజర్ల వినోద్ రాజు, మండలశాఖ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం నేతృత్వంలో పెదగుమ్ములూరు శివారు చెల్లాపురం మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పెదగుమ్ములూరు చర్చి, అడ్డురోడ్డు ఆంజనేయస్వామి ఆలయంలోను ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినోద్ రాజు మాట్లాడుతూ, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి పాదయాత్ర దోహద పడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లపరాజు వెంకటరాజు, గుర్రం రామకృష్ణ, కోన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాత్రయాత్ర విజయవంతం కావాలని కోరుతూ మండలంలోని ఈ.బోనంగి పంచాయతీ ఫార్మాసిటీ కాలనీ కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మాజీ సభ్యులు పైల జగన్నాధరావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ అట్ట సన్యాసప్పారావు, ఆలయ కమిటీ చైర్మన్ గొర్లి కనకారావు, పరవాడ మండల నాయకులు పాల్గొన్నారు.
కశింకోట : కశింకోట దుర్గాదేవి గుడి వద్ద లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ టిడిపి నాయకులు శుక్రవారం 108 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాయల మురళి, ఉగ్గిన రమణ మూర్తి, వేగి గోపి, సిదిరెడ్డి శ్రీను, పెంటకోట రాము, షేక్ బాబర్, సతీష్, తాకాసి కృష్ణ, సూర్యనారాయణ పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుతూ స్థానిక శివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భీమరశెట్టి శ్రీనివాసరావు, దాడి ముసలి నాయుడు, మొల్లేటి సత్యనారాయణ, దాడి శివ, మళ్ల వరానరసింగరావు, ముల్లేటి సత్యనారాయణ ఆడారి గోవిందు, ప్రసాద్, కర్రి గణేష్, సూరిశెట్టి రాము, బొడ్డేడ గంగాధర్ పాల్గొన్నారు.










