Nov 26,2022 23:49

మాట్లాడుతున్న న్యాయమూర్తి లీలావతి

ప్రజాశక్తి-గొలుగొండ:చిన్న చిన్న తగాదాలను లోక్‌ అధాలత్‌లో పరిష్కరం చేసుకోవడంతో ఎంతో మేలు జరుగుతుందని నర్సీపట్నం సీనియర్‌ న్యాయమూర్తి లీలావతి, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రెడ్డి ప్రసన్న తెలిపారు. జోగుంపేట జంక్షన్‌లో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి అనేక హక్కులు కల్పించడం జరిగిందని, వాటిని బాధ్యతగా ఉపయోగించుకోవాలన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడంతో మరికొంత మందికి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గొలుసు నరసింహమూర్తి, గంగాధర్‌, ఎస్‌బిఐ బ్యాంక్‌ అధికారులు, ఎస్సై నారాయణరావు పాల్గొన్నారు.