Sep 09,2023 23:38

ప్రజాశక్తి - పర్చూరు
స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. దీనిలో 391కేసులు పరిష్కరించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం శుభవాణి, జూనియర్‌ సివిల్‌ జడ్జి పి శాంతి ప్రిసైడింగ్‌ జడ్జిలుగా వ్యవహరించారు. క్రిమినల్‌ కేసులు 38, సివిల్‌, నగదు వసూలు కేసులు 25, సివిల్ పార్టేషన్‌ కేసు 1, బ్యాంకు పిఎల్‌సి కేసులు 12, బిఎస్‌ఎన్‌ఎల్‌ పిఎల్‌సి కేసులు 5, శాశ్వత భరణం కేసులు 5, ఎస్‌పిసి కేసులు 305 పరిష్కరించామన్నారు.  రెండు బెంచీల మెంబర్లుగా సిహెచ్‌ శ్రీరమణి, కె ధనలక్ష్మి, ఆర్‌ రమేష్‌బాబు, టి రాజేష్‌లు వ్యవహరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా నరేంద్ర కుమార్ లోక్ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు రోటరీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. సీనియర్ అడ్వకేట్ రావి సత్యనారాయణ ఆర్థిక సహకారంతో వికలాంగులైన వ్యక్తులకు వీల్ చైర్లను అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు, రోటరీ కార్యదర్శి పంబి సదానందరెడ్డి, పాబోలు ఉదయ్ భాస్కర్, కోటా శ్రీనివాసరావు, పాబోలు వెంకన్న, ఆకుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.