Aug 13,2022 23:20

లోక్‌ అదాలత్‌ ప్రారంభంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 19289 కేసులను పరిష్కరించి, పది కోట్లకు పైగా సొమ్మును కక్షిదారులకు పరిహారంగా అందించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానుల హరిహరనాథ శర్మ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కెకెవి బులికృష్ణ తెలిపారు తెలిపారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
లోక్‌ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు అవధానం హరిహరనాథ శర్మ ప్రారంభించి ప్రసంగించారు. విశాఖపట్నంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఉన్న న్యాయస్థానాలతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో 35 బెంచీలు ఏర్పాటుచేసి జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మహానగర సెషన్స్‌ న్యాయమూర్తి జి.శ్రీదేవి, ఇతర న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ బైపా అరుణ్‌ కుమార్‌, ప్యానల్‌ లాయర్లు, పారా లీగల్‌ వాలంటీర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.