Dec 04,2022 00:03

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌పి సతీష్‌కుమార్‌, చిత్రంలో లొంగిపోయిన మావోయిస్టులు

ప్రజాశక్తి ఎటపాక
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఎస్‌ సతీష్‌ కుమార్‌ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎడపాక పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు ఎస్‌పి సతీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఎస్‌పి కథనం ప్రకారం... సుకుమా జిల్లా కుంట మండలం బెజ్జిగరామ గ్రామానికి చెందిన కొవ్వాసి పొజ్జె 2005లో మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యురాలుగా చేరింది. 2022లో పిఎల్‌జిఏ డిప్యూటీ కమాండర్‌గా నియమించబడ్డారు. ఈమె జీరంగూడ శివారులో మావోయిస్టులకు భద్రతా బలవగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో 22 మంది సిఆర్పిఎఫ్‌ జవాన్లు మరణించారు. 2022 సంవత్సరంలో ఎల్లమగుండ, పోటకపల్లి సిఆర్పిఎఫ్‌ క్యాంప్‌పై దాడి ఘటనలో పాల్గొన్నారు. చతిస్‌ఘడ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా పడి మీరు గ్రామానికి చెందిన మడివి శంకర్‌ 2013లో మావోయిస్టు పార్టీలో మలేషియా సభ్యుడిగా చేరాడు. 9 సంవత్సరాలు పాటు మావోయిస్టు పార్టీలో పని చేశాడు. ఈ ఏడాది మార్చి 21న మినప మరి చెంత గొప్ప గ్రామాల మధ్య మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య జరిగిన ఎదుర్కొల్పుల్లో పాల్గొన్నారు. ఈ గట్లలో 17 మంది భద్రత బలగాలు, ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈరగూడ గ్రామ సేవలలో మావోయిస్టులకు భద్రతలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో పాల్గొనగా, ఈ ఘటనలో 22 మంది భద్రతా బలగాలు మరణించారు. మావోయిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు విసిగిపోయి, పార్టీలో ఆదివాసీయేతర నాయకుల నుండి వివక్ష, పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గడం, పోలీసులు గస్తీ పెరగడం, పెరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వంటి కారణాలతో మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిశారని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్‌ 141వ బెటాలియన్‌ కమాండెంట్‌ ప్రశాంత్‌, రంపచోడవరం ఓఎస్‌డి జి కృష్ణ కాంత్‌, చింతూరు ఏఎస్‌పి కేవీ మహేశ్వర్‌ రెడ్డి, ఎటపాక, చింతూరు సిఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.