చొదిమెల్లలో పర్యటించిన పశుసంవర్ధక శాఖాధికారులు
ప్రజాశక్తి - ఏలూరుటౌన్
ఆవులకు లంపి స్కిన్ వైరస్ వ్యాప్తిపై జిల్లా అధికారులు కదిలారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లంపి స్కిన్ ప్రబలినట్లు అనుమానిస్తున్న ఆవులున్న చొదిమెల్ల గ్రామంలో పశుసంవర్ధక శాఖాధికారులు పర్యటించారు. యానిమల్ డిసీజ్ డయోగస్టిక్ లేబరేటరీ అధికారులతో స్థానిక విఎఎస్, సిబ్బందితో కలిసి చొదిమెల్లలో పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.నెహ్రూబాబు సందర్శించారు. అనుమానిత పశువుల నమూనాలను సేకరించి, నిర్ధారణ కోసం భోపాల్ పంపిస్తున్నట్ల్లు ఆయన తెలిపారు. ఇప్పటికే గ్రామంలోని పశువులకు సంబంధిత టీకాలు వేసి, అనుమానిత పశువులకు అవసరమైన చికిత్సను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.అవసరమైన చికిత్స అందించడానికి, ఎల్‌ఎస్‌డి పట్ల రైతుకు అవగాహన కల్పించడానికి గ్రామాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తూ చర్యలు తీసుకున్నామన్నారు.










