Jul 21,2023 23:35

ప్రజాశక్తి - అమరావతి : లంక భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకు వాటిని ఐదేళ్లపాటు లీజుకు ఇస్తామని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ చెప్పారు. ఈ మేరకు మండలంలోని వైకుంఠపురం లంక పొలాలను జెసి శుక్రవారం పరిశీలించారు. గ్రామానికి వచ్చిన ఆయన కృష్ణానదిలో పడవపై కిలోమీటరు పాటు ప్రయాణించి పొలాల వద్దకు చేరుకున్నారు. పొలాల పరిశీలన సందర్భంగా జెసి మాట్లాడుతూ లీజు పట్టాలు పొందిన వారికి రైతు భరోసా, పంట నష్ట పరిహారం, పంట రుణాలు దక్కుతాయని చెప్పారు. గ్రామంలో భూ రీసర్వే పూర్తి చేసుకున్న రైతులందరికీ పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తా మన్నారు. జెసి వెంట ఆర్‌డిఒ రాజకుమారి, తహశీల్దార్‌ విజయశ్రీ, మండల సర్వేయర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.