ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్ల మండలంలోని గని ఆత్కూరు పరిధిలో కృష్ణానదిలో లంక భూములను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ అజరు కుమార్ నుపూర్ పరిశీలించారు. లంక భూమి లీజు విషయమై మండలంలోని కొత్తపేటకు చెందిన రెండు సొసైటీ సభ్యులు పోటీ పడ్డారు. అయితే ఈ లంక భూమి కేటగిరీ 2 కింద నిర్ణయించి లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో భాగంగా మంగళవారం జేసీ లంక భూములు ఎంత మేరకు సాగు చేసేందుకు లీజుకు ఇవ్వవచ్చో క్షేత్ర పరిశీలన చేశారు. రికార్డులు పరిశీలించారు. ఏ మేరకు లంక భూములు లీజుకు ఇవ్వవచ్చో సర్వే చేసి నివేదిక పంపాలని తహశీల్దార్ వి రాజకుమారి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో రవీంద్ర రావు, సర్వే అధికారులు, ఆర్ ఐ శిరీష పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం జూపూడి త్రిలోచనపురం మూలపాడు మరియు కోటికలపూడి గ్రామాలలో గల లంక భూములను క్షేత్రస్థాయిలో మంగళవారం జెసి శ్రీనివాస్ నుపూర్ అజరుకుమార్, సబ్‌కలెక్టర్ విజయవాడ అదితిసింగ్ పరిశీలించారు. మండలంలో సి తరగతిలో ఉన్న లంక భూములను ఏ బి గా మార్చుటకు పంపిన ప్రతిపాదనలు పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు.










