Jun 24,2023 14:30
  • ఇది 48వ లలిత జ్యూవెలరీ షో రూమ్
  • నాణ్యతకు నమ్మకానికి నెంబర్ వన్ షో రూమ్ 

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : నాణ్యమైన నగలు, సరసమైన ధరలతో, సామాన్యులకు అందుబాటులో ఉండే విదంగా ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటున్న పేరుగాంచిన లలిత జ్యూవెలరీ మన సూళ్లూరుపేట పట్టణంలో అందుబాటులోకి వచ్చింది. జి ఎన్ టి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యూవెలరీ షో రూమ్ ను శనివారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతులు మీదుగా ప్రారంభించారు. లలిత జ్యూవెలరీ ఎండి డాక్టరు.ఎం కిరణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ప్రారంభోత్సవంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భముగా ఎండి కిరణ్ కుమార్ మాట్లాడుతూ డబ్బులు ఎవరికీ ఊరికే రావని ప్రతి పైసాకు విలువు కట్టి నాణ్యమైన నగలను ఖాతాదారులకు అందించడమే లలిత జ్యూవెలరీ లక్షమని అన్నారు. ఇది 48వ షో రూమ్ అయితే గూడూరులో 49వ షోరూం, నెల్లూరులో 50వ షోరూం ఒకే రోజు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేసారు. ఈ సందర్భముగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ సూళ్లూరుపేట ప్రాంతవాసులు ఇకపై నగలు కొనడానికి నెల్లూరు, చెన్నై, వెళ్లాల్సిన అవసరం లేదని ఇక్కడే లలిత జ్యూవెలరీ లాంటి షోరూంలు అందుబాటులోకి రావడం శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు చిన్ని సత్యనారాయణ, పోలూరు పద్మ, కౌన్సిలర్లు మిజురు రామకృష్ణ రెడ్డి, పముజుల విజయలక్ష్మి, సన్నారెడ్డి సౌజన్య,ఈదురు చెంగమ్మ, వైసీపీ నేతలు జెట్టి వేణు యాదవ్, తుపాకుల ప్రసాద్, ఐతా శ్రీధర్, గోగులు తిరుపాల్, కాకి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.