ప్రజాశక్తి-కాకినాడ 2021 అక్టోబర్ 3న లఖింపూర్‌ఖేరీ రైతాంగ ప్రదర్శనలో నలుగురి రైతులను కాన్వారు వాహనాలతో తొక్కించి చంపిన బిజెపి మంత్రి అజరు మిశ్రా, అతని కుమారుడైన ఆశిష్ మిశ్రాలను పదవుల నుంచి తొలగించాలని, వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ రోడ్డులో మంగళవారం ఎస్‌బిఐ బ్రాంచిలో బ్లాక్ డే నిర్వహించారు. నిందితుల కొమ్ముకాస్తున్న మోడీ చిత్రపటాలను ధగం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పప్పు ఆదినారాయణ, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. సంఘటన జరిగి నేటికీ రెండేళ్లు పూర్తవుతున్నా మోడీ ప్రభుత్వం నిందితులైన బిజెపి నాయకులపై చర్యలు తీసుకోకుండా చనిపోయిన రైతు కుటుంబాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతుల పోరాటానికి తలవంచి మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్న సందర్భంగా దేశ రైతాంగానికి క్షమాపణలు చెబుతూ నిందితులను కఠినంగా శిక్షిస్తామని, పదవుల నుంచి తొలగిస్తామని చెప్పిన మాటలు కేవలం కంటి తుడుపుకు మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాజు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, సర్వే, ట్రాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సూర్యారావు, రూరల్ సిఐటియు నాయకులు తొట్టిపూడి రాజా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, రామకష్ణ, ప్రసాద్, కాశీ విశ్వనాథ్, శివపార్వతి, ఎఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు, తిరుమలశెట్టి వెంకటరమణ, రాయుడు గోవిందు, కే శ్రీనుబాబు, ఆర్.శివ, ఐ.ఎఫ్.టి.యు నాయకులు శ్రీపాదం సత్తిబాబు, మల్లాడి భైరవ స్వామి, సతీష్, సుబ్రహ్మణ్యం, ఎఐసిసిటియు నాయకులు నరసరాజు తదితరులు పాల్గొన్నారు.










