Aug 28,2023 22:47

ప్రజాశక్తి - భీమవరం
            ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టరేట్‌ నుంచి గృహ నిర్మాణం, ప్రభుత్వ భవనాలు, జాతీయ ఉపాధి హామీ చట్టం, జిజిఎంపి, చేయూత గ్రౌండింగ్‌, జగనన్న తోడు, నాడు - నేడు, జిఇఆర్‌, ఎస్‌డిజిఎస్‌, టిడ్కో గృహాలు తొమ్మిది అంశాలపై జిల్లాలోని అన్ని మండల అధికారులతో జిల్లా జాయింట్‌ కలెక్టరు ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మండలాల వారీగా ప్రగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. లక్ష్యసాధనలో వెనుక బడిన మండలాలు అధికారులపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే పూర్తయిన గృహాల్లో మౌలిక వసతులను గృహ ప్రవేశాలు నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.