
లక్ష్మీరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-దర్శి : తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మూలంరెడ్డి అంజలి తండ్రి యర్రబిండి లక్ష్మీరెడ్డి దశదిన కర్మ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి తాళ్లూరు మండల ఇన్‌ఛార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు, జడ్‌పిటిసి మారం వెంకటరెడ్డి పాల్గొని లక్ష్మీరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, నాయకులు మంచాల నాగార్జునరెడ్డి, మూలంరెడ్డి ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, పులి బ్రహ్మారెడ్డి, యలమందరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.