
జాయింట్ కలెక్టర్ జాహ్నవి
ప్రజాశక్తి - యలమంచిలి
విదేశాల్లో సైతం మంచి గుర్తింపు పొందిన అరుదైన కళ లక్క బొమ్మల తయారీ ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి పేర్కొన్నారు. ఆమె గురువారం మండలంలోని ఏటికొప్పాక గ్రామంలో హస్తకళల శిక్షణ, ఉత్పత్తి కేంద్రంలో హస్తకళాకారుల్ని కలిసి లక్కబొమ్మల తయారీలో ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ముడి సరుకు, విద్యుత్తు సబ్సిడీ, మార్కెట్ గురించి కళాకారులు వివరించారు. ప్రాచీన కళ అయిన లక్కబొమ్మల తయారీ వారసత్వంగా వస్తున్నప్పటికీ ఆధునిక పోకడలు కూడా అంది పుచ్చుకోవాలని జాయింట్ కల్లెక్టర్ సూచించారు. మరింత ఆధునికీకరణ, శిక్షణ కోసం రెండు లేతి మిషన్లు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసెస్టింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, తహశీల్దార్ రాణిఅమ్మాజీ, ఎంపిడిఒ, జడ్‌పిటిసి సంధ్యారాము, ఏరియా కో ఆర్డినేటర్ సత్యనారాయణ, సిసి తల్లిబాబు, విఏఓలు పాల్గొన్నారు.