
మొగల్రాజపురం (విజయవాడ) : లకింపూర్ ఖేర్ లో మరణించిన రైతులకు రైతు సంఘాలు పుష్పాంజలి ఘటించాయి. రైతు సంఘాల సమన్వయ కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిపిఎం కార్యాలయంలో రైతులకు పుష్పాంజలి ఘటించారు. రైతుల మరణాలకు కారకులయినవారిని కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు.