సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన 6వ లియాఫీ సర్వసభ్య సమావేశంలో ఎఐపిసి ఛైర్మన్ ఎం.నారాయణ రెడ్డి, జోనల్ అధ్యక్షులు జె.కృష్ణా రెడ్డి, కడప డివిజన్ అధ్యక్షులు జయ భారత్ రెడ్డి, సెక్రటరీ కదిరప్ప, కోశాధికారి టి.కృష్ణ సమక్షంలో లియాఫీ నూతన జనరల్ బాడీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె.సిద్ధలింగ, కార్యదర్శిగా ఎస్.రామకృష్ణ, కోశాధికారిగా ఎం.రఫీక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఛైర్మన్, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదోని బ్రాంచి మేనేజర్ వై.హనుమంత రావు, ఐసియు అధ్యక్షులు హెచ్.ప్రకాష్, వీరా రెడ్డి పాల్గొన్నారు.










