Oct 18,2023 23:38

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఃఅచ్చంపేట మండలం కోనూరు చంద్ర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సొసైటీ ప్రత్యేక సమావేశం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అధ్యక్షత వహించి సభ్యులతో మాట్లాడారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై శుక్రవారం మరోసారి సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, సత్తెనపల్లి ఆర్‌డిఒ రాజకుమారి, అచ్చంపేట తహశీల్దార్‌ పద్మావతి ఇఇ శంకర్‌, రైతులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా అచ్చంపేట మండలంలోని గ్రంథసిరి, కోనూరు, క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామాల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటల సాగుకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో 360 మంది రైతులకు చెందిన సుమారు 2500 ఎకరాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కోనూరు చంద్రలిఫ్ట్‌ ఇర్రిగేషన్‌ ద్వారా నీరు సరఫరా అవుతోంది. లిఫ్ట్‌ ఇర్రిగేషన్‌ నిర్వహణకు సొసైటీ ఉంది. అయితే ఈ కమిటీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఇటీవల మృతి చెందడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాత్కాలిక కమిటీని అధికార పార్టీకి చెందిన వారితో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. టిడిపికి చెందిన రైతులు దీనిపై అభ్యంతరం చెబుతూ కలెక్టర్‌ను కలిసి ఎన్నికలు నిర్వహించాలని కోరారని తెలిసింది.