లింగంగుంటలో పొలంబడి
ప్రజాశక్తి అనంతసాగరం : మండలంలోని లింగంగుంటలో పొలంబడి కార్యక్రమాన్ని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి పి.శ్రీధర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలలో రైతులు ముఖ్యంగా మిత్ర, శత్రు పురుగుల ఉనికిని పరిశీలించి విశ్లేషంచాలని, ఎందుకనగా పరిసరాల విశ్లేషణ అనేది పొలంబడికి గుండెకాయ వంటిదని, రైతులు తొందరపడి అనవసరంగా పురుగు మందులు పిచికారీ చేయరాదని, పొలాలలో శత్రు పురుగులతో పాటు, పంట పొలాలకు పరోక్షంగా ఉపయోగపడే మిత్ర పురుగులు వుంటాయన్నారు. కనుక రైతులు మిత్ర శత్రు పురుగుల నిష్పత్తిని, వాతావరణాన్ని, గాలివాటం, తెగుళ్ల స్థాయి, పైరు దశలను విపులంగా చర్చించి, తదుపరి చర్యలు తీసుకోవాలని, రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో లింగంగుంట అగ్రికల్చర్ అసిస్టెంట్ వి.నాగేంద్ర, పొలంబడి రైతులు పాల్గొన్నారు.










