వరిపంటను పరిశీలిస్తున్న అధికారి
వరిపంటను పరిశీలిస్తున్న అధికారి
లింగం గుంటలో 'పొలంబడి'
ప్రజాశక్తి-అనంతసాగరం:మండలంలోని లింగంగుంట రైతుభరోసా కేంద్రం పరిధిలో ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు దేవసేనమ్మ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్‌ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు గట్లపై గడ్డి లేకుండా చూసుకోవాలన్నారు. అదే విధంగా సస్యరక్షణను అనుసరించి ఈ సీజన్లో వరి సాగుచేసే రైతులు పంటను ఆశించే పురుగులను గుర్తించామన్నారు. మందులను పిచికారీ చేయాలనీ, అధిక ఖర్చులు పెట్టకుండా, అవసరమైన మందులు మాత్రమే వాడి రైతులు సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు., కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి, అగ్రికల్చర్ అసిస్టెంట్ వి.నాగేంద్ర, పొలంబడి రైతులు పాల్గొన్నారు.










