విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సాంబమూర్తి
ప్రజాశక్తి-అనందపురం: లింగ నిర్ధారణ ప్రోత్సహిస్తే కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష తప్పదని సామాజిక ఆరోగ్యాధికారి సాంబమూర్తి అన్నారు బుధవారం మండలంలోని బోని ఉన్నత పాఠశాలలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ(పిసిఅండ్ పిఎన్‌డిటి) చట్టంపై అవగాహన కల్పించారు. పుట్టబోయే బిడ్డ లింగనిర్థారణ పరీక్షల ద్వారా ఆడబిడ్డ అని తెలిస్తే బ్రూణ హత్యలకు, గర్భస్రావానికి ఒడిగడుతున్నారని, ఇది కఠిన నేరమన్నారు. లింగ నిర్థారణ పరీక్ష చేసినా,ప్రోత్సాహించినా ఐదేళ్ల శిక్షతోపాటు రూ.50వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. లింగనిర్థారణ చట్టాన్ని అతిక్రమించే స్కానింగ్ కేంద్రాలపై డిఎంహెచ్‌ఒకు ఫిర్యాదు చేయాలన్నారు.కార్యక్రమంలో హెచ్‌ఎం బి అప్పలరాజు, ఉపాధ్యాయులు పి.జశ్వంత్, ఆశా కార్యకర్త డి కనకరత్నం పాల్గొన్నారు.










