Sep 30,2023 00:28

సత్తెనపల్లి రూరల్‌: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కాన్‌ సెంటర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి ఆర్డీఓ బిఎల్‌ఎన్‌ రాజకుమారి హెచ్చరించారు.. సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో పి సి పి ఎన్‌ డి టి యాక్ట్‌ పై ఉప జిల్లా సాయి సత్తెనపల్లి మల్టీ మెంబర్స్‌అధారిటీ , ఉప జిల్లాస్థాయి స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఎం. పద్మావతి,డివిజన్‌ ఇంచార్జి డా. నాగ పద్మజ, కమిటీ సభ్యులు డాక్టర్‌ సుష్మ, డాక్టర్‌ ప్రేమ,డాక్టర్‌ అనూష,జిల్లా డిప్యూటీ డెమో కె.సాంబశివరావు, ఖాజావలి, యన్‌.జి.ఓ సంస్థల ప్రతినిధులు బి.నాగ సాయిప్రసాద్‌, కె. వెంకటేశ్వరరావు, పి.సాంబశివరావు పాల్గొన్నారు.