Jul 14,2023 19:18

రమేష్‌ యాదవ్‌ను అభినందిస్తున్న చిత్ర యూనిట్‌

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని కుర్రాడు రాజ్‌ వీర్‌ నటుడిగా నటించిన 'లిల్లీ' సినిమాకు రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. స్నేహం ప్రాముఖ్యత, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే సందేశంతో కూడిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాకు మద్దతు కోసం హీరో బృందం, చిత్ర యూనిట్‌ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి, జనసేన ఇన్‌ఛార్జీ మల్లప్ప, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్‌ యాదవ్‌ను కలిసి సినిమా పట్ల చర్చించుకున్నారు. ఈ సినిమాకు తమ పూర్తి మద్దతు, సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులకు ఒక షో మొత్తం 326 సీట్లు ఉచితంగా కేటాయించి సినిమా ప్రదర్శనకు సహకరించినట్లు రమేష్‌ యాదవ్‌ తెలిపారు. సినిమా చూసిన అనంతరం చిన్నారులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగ్గదని రమేష్‌ యాదవ్‌ తెలిపారు. ఇంతకుముందు చిత్ర యూనిట్‌ సభ్యులు రమేష్‌ యాదవ్‌ను పూలమాలతో సన్మానించారు.