ప్రజాశక్తి-పిఠాపురం ప్రజలకు న్యాయ సేవా సంస్థకు వారిధిగా పారా లీగల్ వాలంటీర్ల సేవలు ఉండాలని పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి అన్నారు. శుక్రవారం స్థానిక కోర్టు హాలు ఆవరణలో నూతనంగా ఎంపికైన పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ శిబిరరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్లు గ్రామ పట్టణ పరిధిలో పలు సమస్యలు న్యాయవాదుల ద్వారా మండల న్యాయ సేవాధికార సంస్థ నుంచి కోర్టుకు విన్నవిస్తే సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. న్యాయ సేవాధికార కార్యక్రమాలు, కరపత్రాలు పలు అవగాహన కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందజేయవచ్చన్నారు. ఎంపికైన వాలంటీర్లకు చట్టాలపై అవగాహన, కోర్టు రూల్స్ తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేరుగ రాజారావు, ఉపాధ్యక్షులు కేసర్ భాస్కర్, శిక్షణ అందించిన బాదం ఈశ్వర్ బాబు, ఉదయభాస్కర్ పాల్గొన్నారు.










