Sep 12,2023 20:46

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న విసి

కడప అర్బన్‌ : నేటితరం యువతకు విద్యార్థులకు 'లీడర్‌షిప్‌ స్కిల్స్‌' పుస్తకం నాయకత్వ మార్గదర్శిగా నిలుస్తుందని యోగి వేమన విశ్వవిద్యాలయం విసి ఆచార్య చింతా సుధాకర్‌ అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌ ఆచార్య సామాను రఘునాథరెడ్డి రచించిన పుస్తకాన్ని విసి తన ఛాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ యువత వత్తిపరమైన నైపుణ్యాలను ఆకళింపు చేసుకుని, వారి వ్యక్తిత్వ అభివద్ధికి పుస్తకం పాటుపడుతుందన్నారు. వ్యక్తిత్వ వికాసం అనేది ఒక వ్యక్తి శారీరక, భావోద్వేగ, మేధోపరమైన కోణాలలో నిరంతర వద్ధిని జరుగుతుందన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నైతిక సూత్రాలు, నాయకత్వ లక్షణాలు, ఉన్నతమైన వ్యక్తిత్వం కోసం సహాయపడుతాయన్నారు. మేనేజ్మెంట్‌ విద్యార్థులకు ప్రయోజనకరం ఈ పుస్తమన్నారు. కార్యక్రమంలో ఐక్యూ ఎసి సంచాలకులు సుబ్రహ్మణ్య శర్మ, ఆచార్య ఎన్‌ సి గంగిరెడ్డి, ఆచార్య చంద్రశేఖర్‌ పాల్గొన్నారు