ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: ఏస్ టర్టిల్ ఆధ్వర్యంలో 'లీ' బ్రాండ్ షోరూమ్‌ను గురువారం ఉదయం గాయత్రినగర్ స్టెల్లా కళాశాల ఎదుట శాసన సభ్యులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీన్స్‌లో అత్యుత్తమ బ్రాండ్ లీ షోరూమ్ విజయవాడ నగరంలో ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. మెన్స్ వేర్‌లో అగ్రగామిగా ఉన్న లీ ఉత్పత్తులను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరిమాన్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు శిరీష్, సూర్యనారాయణ, శ్యామ్ అనిరుధ్ మాట్లాడుతూ వరిమాన్ గ్లోబల్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్ట మొదటి 'లీ' బ్రాండ్ ఫ్రాంచైజీని విజయవాడ నగరంలో ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో అన్ని ప్రాంతాలలో ప్రారంభిస్తారన్నారు. షోరూమ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా మెన్స్‌వేర్‌లో కిడ్స్, యువత కోసం ప్రత్యేకంగా డెనిమ్ టీ షర్టులు, షర్టులు, ఫ్యాషన్ వేర్ లభ్యమవుతాయని తెలిపారు. జీన్స్‌లో రెగ్యులర్‌ఫిట్‌తో పాటు లూజ్ ఫిట్, సేన్ ఫిట్ ప్రీమియం ప్రొడక్ట్సు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.










