ప్రజాశక్తి- కె.కోటపాడు : లెప్రసీ వ్యాధితో బాధపడుతున్న మండలంలోని లంకవానిపాలెం గ్రామానికి చెందిన కిల్లాడ ముసలినాయుడుకు టిడిపి మాడుగుల నియోజకవర్గం నాయకులు పైలా ప్రసాదరావు గురువారం రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బండారు నరసింహనాయుడు, గ్రామ నాయకులు లెక్కల దేవుడుబాబు, డెక్క శ్రీను, కొరుపోలు సునీత, గాడి అక్కునాయుడు, కొరుపోలు సాంబయ్య, కొరుపోలు తాత తదితరులు పాల్గొన్నారు.
అన్నసమారాధనకు రూ.5వేలు విరాళం
కార్తీక మాసం సందర్భంగా మండలంలోని ఎ.కోడూరులో లెక్కల వారి కుటుంబం బంగారమ్మ అమ్మవారి గుడి వద్ద ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో టిడిపి మాడుగుల నియోజకవర్గ నాయకులు పైలా ప్రసాదరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నసంతర్పణ కార్యక్రమానికి రూ.5 వేలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమలో సర్పంచ్ బొడ్డు అక్కునాయుడు, మాజీ సర్పంచ్ లెక్కల మల్లేశ్వరరావు, రాయవరపు మల్లేష్, లెక్కల జగ్గునాయుడు, లెక్కల కన్నం నాయుడు, లెక్కల సురేష్, లెక్కల ఎరుకునాయుడు తదితరులు పాల్గొన్నారు.










