
ప్రజాశక్తి-డెంకాడ : లెండి కళాశాల విద్యార్థులు ఎడ్‌గ్రూమ్ బ్లాగ్ రైటింగ్ కాంటెస్ట్‌లో అవార్డులు కైవశం చేసుకోవడం ద్వారా రచనా నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని వైస్ ప్రిన్సిపల్ తమ్మినేని హరిబాబు తెలిపారు. లెండి ఆన్‌లైన్ ప్రయోగశాల వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. విదేశీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ స్కైలార్క్ సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. సిఎస్‌ఇ మూడో ఏడాది విద్యార్థి హషిత ఈ పోటీలో విజేతగా నిలిచి, మొదటి బహుమతి సాధించింది. సిఎస్‌ఎస్‌ఇ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్న స్నేహ లతారెడ్డి, భవ్యి సాయి కీర్తి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా స్కైలార్క్ సిఇఒ కూచిపూడి సతీష్, ఎడ్‌గ్రూమ్ వ్యవస్థాపకులు వెంకటేష్, స్విగ్గీ డేటా సైంటిస్ట్ జి.విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ పోటీ వ్యక్తిగత విజయాల వేడుకగా మాత్రమే కాకుండా లెండి కళాశాలలో పెంపొందించిన సహకార స్ఫూర్తి, విద్యా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిందని ప్రిన్సిపల్ వివి రామారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె.నరసింహం, అన్ని విభాగాల అధిపతులు ఎం.రాజన్‌బాబు, కె.సుబ్రమణ్య, పూజారి సతీష్, రాజేందర్, జి.సతీష్, పి.దుర్గా శైలజ పాల్గొన్నారు.